telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆక్సిజన్ పైపులను కోసొచ్చే నికృష్టుడు….చంద్రబాబు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు టీడీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.  ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకుని కూర్చుంటాడని… రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఉన్నట్టుందని ఎద్దవా చేశారు. “కరోనా మహమ్మారి ప్రపంచ యుద్ధాల కంటే దారుణమైనది. పాకిస్తాన్, చైనాతో మనం జరిపిన పోరాటాల కంటే పెద్దది. ఆపత్కాలాల్లో ప్రజలను కాపడుకోవడానికి విభేదాలు మరిచి ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలతో సహకరించడం చూశాం. ఎల్లో గ్యాంగు నుంచి అంత గొప్ప ఆలోచనను ఆశించలేం. కొన్ని బతుకులంతే. ఎక్కడ కరోనా మరణం వార్త కనిపిస్తుందా అని బాబు కనిపెట్టుకుని కూర్చుంటాడు. రాత్రి పూట నిద్ర పట్టని శాపం ఏదో ఉన్నట్టుంది. ఉన్న పనల్లా ఇదే. నాల్రోజుల పాటు అంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తే ఏ అర్థరాత్రో తనే ఆక్సిజన్ పైపులను కోసినా కోసొచ్చే నికృష్టుడు. సి’గ్గు, ఎ’గ్గు అనే పదాలకు దగ్గరగా ఉండే మరో మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ మధ్య. దాన్ని వినడంతోనే ఆయన కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోవడం, వినకూడని భాషలో విరుచుకుపడటం పరమ అసహ్యంగా అనిపిస్తోంది.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Related posts