telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భువనేశ్వర్ : … సీఏఏ అవసరమే.. అంటున్న కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగీ…

central minister sarangi on CAA

నన్‌కనా సాహేబ్ గురుద్వారాపై జరిగిన దాడి దేశానికి పౌరసత్వ సవరణ చట్టం అవసరమని రుజువు చేస్తోందని కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో మైనారిటీలు ఏమాత్రం క్షేమంగా లేరని తెలిపారు. గురుద్వారాపై రాళ్లదాడి సీఏఏ అవసరమని నిరూపిస్తోంది. పాకిస్తాన్‌లో సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, క్రిస్టియన్లు, హిందువులు ఏమాత్రం క్షేమంగా లేరని చూపిస్తోందని అన్నారు. మూడు దేశాల్లోని మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వడానికి భారత్ నైతికంగా కట్టుబడి ఉందని సారంగీ స్పష్టం చేశారు.

Related posts