telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ముందే రానున్న నైరుతి..తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు

rain hyderabad

తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా వింత వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి విపరీతమైన ఎండ, సాయంత్రానికి చల్లబడి అక్కడక్కడా వర్షాలు పడటం జరుగుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది మాత్రం కాస్త ముందుగానే రానున్నట్లు ఇస్రో వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఇటు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపారు. ముఖ్యంగా నిజామాబాద్, అదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డితో పాటు వరంగల్, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది.

Related posts