telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముగిసిన నామినేషన్ల పర్వం – ఎంత మంది వేశారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు, అలాగే తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.

ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది.

ఈరోజు శుక్రవారం నామినేషన్ల పరిశీలన, మరియు ఉపసంహరణ ప్రక్రియ 29న కొనసాగనుంది.

మే 13న పోలింగ్ జరగనుంది, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 4,384 నామినేషన్లు దాఖలు కాగా, 25 లోక్‌సభ స్థానాలకు 763 నామినేషన్లు దాఖలయ్యాయి.

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం 547 నామినేషన్లు దాఖలయ్యాయి.

చివరి రోజు నామినేషన్లలో గణనీయమైన పెరుగుదల కనిపించింది, స్వతంత్ర అభ్యర్థులు మరియు ప్రధాన పార్టీలు చురుకుగా పాల్గొన్నాయి.

ముఖ్యంగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి 101 నామినేషన్లు దాఖలయ్యాయి.

తెలంగాణ లో నామినేషన్లు దాఖలు వివరాలు,
నల్గొండలో 85, భువనగిరిలో 81, నిజమాబాద్‌లో 77, పెద్దపల్లిలో 74 కరీంనగర్‌లో 69, వరంగల్‌లో 62, చేవెళ్లలో 59, ఖమ్మంలో 57, మెదక్‌లో 55,
జహీరాబాద్‌లో 41, మహబూబ్ నగర్‌లో 42, సికింద్రాబాద్ 60, హైదరాబాద్‌లో 48, ఆదిలాబాద్‌లో 39, నమోదయ్యాయి

మహబూబ్‌నగర్ 32 , ఆదిలాబాద్‌లో 39, మహబూబాబాద్‌లో 32, నాగర్ కర్నూల్‌లో 23 మంది ఉన్నారు.

అదనంగా, ఉప ఎన్నిక నిర్వహించే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 38 నామినేషన్లు దాఖలయ్యాయి.

Related posts