telugu navyamedia
క్రీడలు వార్తలు

గవాస్కర్ వ్యాఖ్యల పై స్పందించిన ఇంగ్లాండ్ ఆటగాడు…

టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం జానీ బెయిర్‌స్టో ఘోరంగా విఫలమయ్యాడు. చివరి రెండు టెస్టుల్లో మూడు సార్లు డకౌట్‌గా వెనుదిరిగిన బెయిర్‌స్టో పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్‌ గవాస్కర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. టెస్టు మ్యాచ్‌ ఆడే సమయంలో క్రీజులో ఉండడానికి బెయిర్‌స్టో ఆసక్తి చూపించడం లేదని కామెంట్‌ చేశాడు. తాజాగా లిటిల్‌ మాస్టర్‌ గవాస్కర్ వ్యాఖ్యలపై బెయిర్‌స్టో స్పందించాడు. ‘నిజానికి సునీల్ గవాస్కర్ నా పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలియదు. అప్పుడే తెలిసి ఉంటే.. వెంటనే స్పందించేవాడిని. ఏదైతేనేం గవాస్కర్ కావాలంటే నాకు ఫోన్‌ చేసి మాట్లాడొచ్చు. టెస్టు క్రికెట్‌లో కుదురుగా ఆడడానికి ఒక లెజెండరీ క్రికెటర్‌ ఇచ్చే విలువైన సలహాల కోసం ఎదరుచూస్తున్నా. అతను కోరుకుంటే.. నాకు కాల్‌ చేయొచ్చు లేదా ఫోన్‌ ద్వారా మెసేజ్‌ పంపొచ్చు. ఎందుకంటే నా ఫోన్‌ ఇప్పుడు ఆన్‌లో ఉంది’ అని బెయిర్‌స్టో సన్నీపై సెటైర్ వేశాడు. మరి బెయిర్‌స్టో రిప్లైపై గవాస్కర్ స్పందిస్తాడేమో చూడాలి. అయితే ప్రస్తుతం ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో విధ్వంసం సృష్టిస్తున్న బెయిర్‌స్టో ఈరోజు జరగనున్న చివరి వన్డే లో ఏం చేస్తాడు అనేది చూడాలి.

Related posts