telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ లో హైకోర్టు ఉండాలన్న ప్రజల కల నెరవేరింది: జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

Justice Praveen Kumar Amaravati High Court

ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఉండాలన్న ప్రజల కల నెరవేరిందని జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..రాజధానితో పాటు హైకోర్టు నిర్మాణం చారిత్రాత్మకమని చెప్పారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా భూమి సేకరించి భవనాలు నిర్మించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.

అమరావతి కొత్త రాజధాని కాదని… శాతవాహనుల కాలంలోనే ఆంధ్రుల రాజధాని అని అన్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక 1954లో గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1956 తర్వాత హైకోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటైందన్నారు. అమరావతి హైకోర్టు దేశంలోనే గొప్పదిగా వెలుగొందాలని ఆశిస్తున్నానన్నారు. 2 వేల ఏళ్ల చరిత్ర ఉన్న అమరావతిలో మరో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. రేపటి నుంచే హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు.

Related posts