telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అస్సాంలో దారుణం : 18 ఏనుగుల అనుమానాస్పద మృతి

Elephant

అస్సాంలో విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని నాగార్ జిల్లాలోని బాముని హిల్స్ లో 18 అడవి ఏనుగులు సహా భారీగా ఇతర జంతువులు మృతి చెందినట్లు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు.. మెరుపు దాడిలో జంతువులు మృతి చెందినట్లు తెలుస్తుందని రాష్ట్ర అటవీ శాఖ వర్గాలు తెలిపారు. ఏనుగుల మరణం గురించి స్థానిక గ్రామస్థులు మాకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం, ఏనుగులు చనిపోవడానికి అసలు కారణం, మరణాలు సంఖ్య సరైన సమయంలో తెలుస్తుందని అటవీశాఖ పేర్కొంది. అయితే తమకు తెలుస్తున్న దాని ప్రకారం 18 ఏనుగులు మృతి చెందాయని.. మృతదేహలను పోస్టుమార్టం కోసం పంపినట్లు వెల్లడించారు.

Related posts