హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అర్ధరాత్రి 200 మంది విద్యార్థులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సమయంలో విద్యార్థులు ఇక్కడికి రావడమేంటని సిబ్బంది అంతా ఆశ్చర్యపోయారు. సీఎం ఇంటి వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.
అసలు అక్కడ ఏం జరిగిందంటే… అటెండెన్స్ తక్కువ ఉందన్న కారణం చేత కాలేజీ యాజమాన్యాలు తమకు హాల్ టికెట్స్ ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు.
సూర్యాపేట, సిద్దిపేట, నల్గొండ, హైదరాబాద్ నుంచి గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు తమ ఆందోళనలకు తరలివచ్చారు.
బయోమెట్రిక్ విధానంలో సాంకేతిక సమస్యలపై ఆరోపణలు వచ్చాయి. సత్వరమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించి హాల్‌టికెట్లు జారీ చేయాలని సిఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
అయితే అర్థరాత్రి సీఎంను కలవడం కుదరదని సిబ్బంది విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
బదులుగా, విద్యార్థులు తమ సమస్యలను సిఎంకు అందించడానికి ఉదయం 10 గంటలకు తిరిగి రావాలని వారు ప్రతిపాదించారు.
పరీక్షలు ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎస్సీ వర్గీకరణపై వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలి: మంద కృష్ణ