ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీర్మానాన్ని ప్రభుత్వం న్యాయస్థానానికి సమర్పించింది. పలు అంశాలతో అఫిడవిట్ దాఖలు చేసింది. చర్చల ప్రక్రియ కొనసాగుతుండగానే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని, అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ.47కోట్లు ఆర్టీసీకి చెల్లించినప్పటికీ సమస్య పరిష్కారం కాదని తెలిపింది.
ఆర్టీసీకి చెల్లింపులు, రుణాలు, నష్టాలను పూడ్చడానికి రూ.2,209 కోట్లు అవసరమన్న ప్రభుత్వం రూ.47 కోట్లు ఏమూలకు సరిపోవని నివేదికలో పేర్కొంది. కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని భీష్మించుకుని కూర్చుంటే చర్చలు సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వం తెలిపింది.పారిశ్రామిక వివాదాల చట్టం కింద చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును కోరింది. ఇంకా విచారణ కొనసాగుతోంది.
కోట్లాది మంది ఆంధ్రుల్లో తానూ ఒకడిని: కేవీపీ