telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపటి నుండే .. నూతన ఇసుక పాలసీ ..

sand issues raised in AP with govt policies

ప్రభుత్వం 5వ తేదీ నుంచి కొత్త ఇసుక పాలసీ అమలు చేయనుందని, ఈ మేరకు రాష్ట్ర గనుల శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు మైన్స్‌ అండ్‌ జియాలజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుబ్బరాయుడు ప్రకటనలో పేర్కొన్నారు. సిద్దవటం మండలం జ్యోతి, రాజంపేట మందరం, బాలరాజుపల్లె, ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామం, ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె గ్రామాల నుంచి ఇసుకను గుర్తించిన నాలుగు స్టాక్‌ పాయింట్ల నుంచి ఇసుకను వినియోగదారులు పొందవచ్చన్నారు.

ఇసుక నిల్వ కేంద్రాలు జ్యోతి గ్రామం, కిచ్చమాంబపురం బాలరాజుపల్లె, ప్రొద్దుటూరులోని దొరసానిపల్లెలో ఇసుక అందుబాటులో ఉంటుదన్నారు. ఇసుక అవసరమైన వినియోగారులు మీసేవ ద్వారా రిజిస్టరు చేసుకుని ముందస్తుగా బుకింగ్‌ చేసుకోవాలని ఏడీ పేర్కొన్నారు. ఇసుక నిల్వకేంద్రాల నుంచి రవాణా ఛార్జీల కింద ఒక టన్ను ఇసుక కిలోమీటరు రవాణాకు 4.90 పైసలు ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏడీ పేర్కొన్నారు.

Related posts