అత్యవసర వైద్యసేవలందించేందుకు ఏపీ సీఎం జగన్ ఇటీవలే ఆధునిక సౌకర్యాలతో కూడిన 108, 104 వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ వాహనాలన్నీ జిల్లాలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరి నియోజకవర్గంలో 108, 104 వాహనాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ 108 అంబులెన్స్ ను రోజా స్వయంగా నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
ఆమె ట్రాఫిక్ లో సైతం అలవోకగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మంచి పనులు చేస్తూ సీఎం జగన్ ప్రజల గుండెల్లో చోటు దక్కించుకుంటున్నారని కొనియాడారు. టీడీపీ నేతలు తిన్నది అరక్క ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.