ప్రస్తుతం మన దేశంలో కరోనా చాలా వేగంగా విస్తరిస్తుంది. అయితే ఈ వైరస్ ఎవరిని వదలడం లేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాల సీఎంలు కరోనా బారిన పడ్డగా ఇక ఇప్పుడు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ వెల్లడించారు. గజ్వేల్ ఫాం హౌస్ లో ఐసోలేషన్ లో కేసీఆర్ ఉన్నారని ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ ల బృందం పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. హలియాలో సభ పూర్తయిన నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు.అయితే కొద్దిరోజుల క్రితమే ఆయన నాగార్జున సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌కు మద్దతుగా ఆయన హాలియా ఎన్నికల సభలో పాల్గొన్నారు. అయితే నోముల భగత్‌కు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న విషయం తెలిసిందే.
previous post