telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రసవత్తరంగా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ : 20 మంది అభ్యర్థులు ఎలిమినేట్

municipal election counting started

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. నల్గగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానంలో స్థానంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయినా ఎవరికీ 51 శాతం ఓట్లు దక్కలేదు. దీంతో ఫలితం కోసం రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. రెండో దశలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 20 మంది అభ్యర్థులను ఎలిమినేషన్‌ చేశారు ఎన్నికల అధికారులు. ఇక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,10,840 సాధించగా.. మల్లన్నకు 83,290, కోదండరాంకు 70,072, బీజేపీకి 39,107 ఓట్లు వచ్చాయి. తన సమీప అభ్యర్థి మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇక కాసేపటి క్రితమే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందలంటే కావాల్సిన ఓట్లు 72,327 కాగా… తీన్మార్ మల్లన్న గెలుపొందలంటే 99,877 ఓట్లు కావాలి. కోదండరామ్ గెలవాలంటే 1,13,095 ఓట్లు సాధించాల్సి ఉంటుంది.

Related posts