తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. సమయం వచ్చినప్పుడు శ్రీనివాస్ గౌడ్ చరిత్ర బయటపెడతానంటూ హెచ్చరించారు. మంత్రులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని మండిపడ్డారు. కాంగ్రెస్ ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బచ్చాగాళ్లకు కాంగ్రెస్ పార్టీ గురించి ఏంతెలుసని అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెట్టిచాకిరీ చేసే మనిషి అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ చెప్పింది చేయడానికి ఉన్న చెంచా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి కాదు, ఓ బ్రోకర్ అని ఆరోపించారు. ఉద్యోగులకు ఏంచేశారని సీఎం కేసీఆర్ కు శ్రీనివాస్ గౌడ్, మమత అనే ఉద్యోగిని స్వీట్లు తినిపించారని మండిపడ్డారు.
టీడీపీ కాపులనువాడుకుని వదిలేసింది: మంత్రి బొత్స