telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వికారాబాద్ జిల్లాలో బర్త్ డే వేడుకలు : హిజ్రాలతో అశ్లీల నృత్యాలు

వికారాబాద్ జిల్లాలో బర్త్ డే వేడుకలు కలకలం రేపాయి. ఈ వేడుకల్లో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేస్తూ హాల్ చల్ చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లిలో అర్థరాత్రి హిజ్రాలతో రికార్డు డ్యాన్సులు చేశారు. ఈనెల 11న దిర్సంపల్లికి చెందిన పిల్లి మొగులయ్య అనే లోకల్ లీడర్ ఇంట్లో ఈ ఘటన వెలుగు చూసింది. తన మనవరాలి పుట్టినరోజు వేడుకల్లో ఈ హంగామా చేశారు. లాక్ డౌన్ నిబంధనలు గాలికొదిలి డిజెలతో చిందులు వేశారు. ఫంక్షన్ కు వచ్చి బోజనం చేసి.. చూసి చూడనట్టు వెళ్ళిపోయారు దోమ పోలీసులు. సోషల్ మిడియాలో అశ్లీల నృత్యాల వీడియోలు చక్కర్లు కొట్టడంతో విషయం బయటకొచ్చింది. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్షలు వస్తున్నాయి. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts