కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడ్డారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా టచ్ చేసింది కరోనా.. తాజాగా..కేరళ రాష్ట్ర గవర్నర్ మహమ్మద్ ఖాన్ కూడా కరోనా బారినపడ్డారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగాలేదని..లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ఆ పరీక్షల్లో గవర్నర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని..అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని స్వయంగా గవర్నర్ పేర్కొన్నారని రాజ్ భవన్ పీఆర్వో వెల్లడించారు. కాగా…గతవారం న్యూ ఢిల్లీ లో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని లేదా ముందు జాగ్రత్తలో భాగంగా పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
previous post
next post