telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : విన్నర్ శ్రీముఖే… తేల్చేసిన వితిక

Vithika

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్రమం ముగింపు దశకు వచ్చేసింది. సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ కార్యక్రమంలో 12వ వారం ఇంటి నుండి వరుణ్ సందేశ్ భార్య వితికా ఎలిమినేట్ అయ్యింది. గత వారం ఇక బిగ్‌బాస్ హౌస్‌లో బాబాభాస్క‌ర్‌, వరుణ్ సందేశ్‌, వితిక‌, రాహుల్‌, అలీ రెజా, శివ జ్యోతి, శ్రీముఖి ఉండగా… 12వ వారం కోసం అందరూ ఎలిమినేషన్ లోకి వచ్చారు. మ‌రి వ‌చ్చేవారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా… ఎవరికి వారు అనాలిసిస్ చేస్తూ విన్నర్‌ను డిసైడ్ చేస్తున్నారు. ఐతే ఆదివారం షో నుంచి ఎలిమినేట్ అయిన వితిక బిగ్‌ బాస్ విన్నర్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. బిగ్ బాస్ హౌస్‌లో వితిక, వరుణ్ జంట పరస్పరం సహకరించుకుంటూ గేమ్ ఆడారు. టాస్క్‌ల్లో వితికను గెలిపించేందుకు, నామినేషన్‌లోకి వెళ్లకుండా సేవ్ చేసేందుకు వరుణ్ సందేశ్ పలుసార్లు త్యాగాలు కూడా చేశాడు. హౌస్‌లో ఆమెపై ఎవరైనా నోరు జరినా..వారితో గొడవ పెట్టుకునేవాడు. ఒక విధంగా చెప్పాలంటే తన వైఫ్‌ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు వరుణ్. ఈ నేపథ్యంలో తన భర్తే బిగ్ బాస్ టైటిల్ గెలుస్తాడని వితిక చెబుతుందని అందరూ భావించారు. కానీ వరుణ్‌కు షాకిస్తూ.. రెండో ర్యాంకును కేటాయించింది అతని భార్య. తన అంచనాల ప్రకారం బిగ్ బాస్ తెలుగు 3 టైటిల్‌ను శ్రీముఖే గెలుస్తుందని అంచనా వేసింది వితిక. ఇక రెండో స్థానంలో వరుణ్ సందేశ్ ఉంటాడని చెప్పిన వితిక.. మూడో ర్యాంకును బాబా భాస్కర్‌కు, నాలుగో స్థానాన్ని రాహుల్‌కు, ఐదో స్థానాన్ని శివజ్యోతికి, ఆరో స్థానాన్ని అలీ రెజాకు కేటాయించింది. మూడు నెలలుగా తాము ప్రెజర్ కుక్కర్లో ఉన్నట్లుగా హౌస్‌లో ఉన్నామని.. కానీ అలీ మాత్రం ఒకసారి ఇంటికి వెళ్లి వచ్చాడని చెప్పింది. అందుకే ఆయనకు ఆఖరి స్థానాన్ని ఇస్తున్నట్లు తెలిపింది. మా మ్యూజిక్‌లో వచ్చే తనిష్ ఇంటర్వ్యూలో తన అంచనాల ప్రకారం ఈ ర్యాంకులు ప్రకటించింది వితిక.

Related posts