ఇప్పటికే ట్విట్టర్, ఫేస్బుక్, ఇనస్టాగ్రామ్, యూట్యూబ్ తదితర ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలు కూడా ట్రంప్ ఖాతాలను బ్యాన్ చేశాయి. తాజాగా ఈ జాబితాలో తాజాగా స్నాప్‌చాప్ కూడా చేరింది. ట్రంప్ ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేసినట్లు స్నాప్‌చాప్ ప్రకటించింది. దేశ రాజధాని వాషింగ్టన్‌లోని కేపిటల్ భవనంపై దాడి ఘటన వల్లే ఈ చర్యకు ఉపక్రమించినట్లు స్పష్టం చేసింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ట్రంప్ తన స్నాప్‌చాట్ ఖాతా ద్వారా అశాంతిని రేకెత్తించే అవకాశం ఉన్నందున ఆపరేటర్లు భయపడుతున్నారని, అందుకే ఆయన ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేసినట్లు స్నాప్‌చాట్ చెప్పుకొచ్చింది. ఈనెల 6న కేపిటల్ భవనంపై దాడి జరిగాక.. ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్.. ట్రంప్ ఖాతాను వారం పాటు బ్యాన్ చేసింది. ట్విట్టర్ బాటలోనే నడిచాయి ఫేస్బుక్, ఇన్‌స్టా. ట్రంప్ ఖాతాను తాత్కాలికంగా బ్యాన్ చేశాయి. ఇంకెప్పుడూ.. తమ ప్లాట్‌ఫామ్‌పై ట్రంప్ ఇక పోస్టులు పెట్టలేరని స్పష్టం చేసింది. ఆ తర్వాత యూట్యూబ్ కూడా అదే పనిచేసింది. ట్రంప్ యూ ట్యూబ్ చానెల్‌పై ఏడు రోజుల పాటు నిషేధం విధించింది. ఎలాంటి వీడియోలూ అప్లోడ్ చేయకుండా చర్యలు తీసుకుంది. తన విధానాలను ఉల్లంఘించినట్లు కూడా యూట్యూబ్.. ట్రంప్ ఛానల్‌కు వార్నింగ్ ఇచ్చింది.
previous post
చంద్రబాబుకు ఫేస్ వాల్యూ లేదు: లక్ష్మీపార్వతి