telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంఫ్రదాయ చీరకట్టులో అనుష్క… హ్యాపీ బర్త్ డే పప్పా అంటూ…

anushka

దేశ వ్యాప్తంగా ఉన్న లాక్ డౌన్ వల్ల ఇళ్లలోనే లాక్ అయ్యారు స్టార్ హీరోలు, హీరోయిన్లు. దేశ వ్యాప్తంగానే కాదు ప్రస్తుతం ప్రపంచంలో చాలా దేశాల్లో లాక్ డౌన్ నడుస్తుంది. అంతా ఇంటికే పరిమితమైపోయారు. ఈ సమయంలో తన ఫ్యామిలీతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది స్వీటీ. సోమవారం తన తండ్రి విట్టల్ శెట్టి పుట్టిన రోజు కావడంతో ఆయనతో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇందులో అనుష్క తల్లి ప్రఫుల్లా కూడా ఉన్నారు. సాంప్రదాయ బద్ధంగా పేరెంట్స్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఉంది అనుష్క. ఈ ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన తండ్రికి ఎమోషనల్ విషెష్ అందించింది అనుష్క. ‘మీరు మా కోసం ఎన్నో చేశారు. మమ్మల్ని ఆనందంగా ఉంచిన మీరు ఇలానే ప్రతి రోజు నవ్వుతూనే ఉండండి. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ.. ఆప్యాయంగా ప్రోత్సహించడాన్ని చూస్తూనే ఉన్నాం. హ్యాపీ బర్త్ డే పప్పా’ అంటూ ఎమోషనల్ విషెష్ అందించింది స్వీటీ. అయితే అనుష్క పేరెంట్స్ చాలా మంది పరిచయం లేకపోవడంతో ఈ ఫొటో వైరల్ అవుతోంది. ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ రిలీజ్‌కి రెడీగా ఉంది. లాక్ డౌన్ లేకుండా ఉంటే ‘నిశ్శబ్దం’ సినిమా ఈపాటికి థియేటర్స్‌లో సందడి చేసేది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మాధవన్ హీరోగా నటించగా.. హీరోయిన్లు అంజలి, శాలిని పాండే కీలక పాత్రల్లో నటించారు. హాలీవుడ్ నటుడు మ్యాడిన్సన్ విలన్‌గా నటించాడు.

Related posts