telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యూవీక్రియేషన్స్ లో ఆ సినిమా కు హీరోయిన్ ఫిక్స్

Kavya

దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా ప్రభాస్ సొంత బ్యానర్ యూవీక్రియేషన్స్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే ఓ మంచి కథను కూడా ఎంపిక చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ గా మోడల్ కమ్ హీరోయిన్ అయిన కావ్య థపర్ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈమె తెలుగులో ‘ఈ మాయ పేరేమిటో’ అనే సినిమాను చేసింది. కానీ ఆ సినిమా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ భామ తమిళ్ హిందీ సినిమాలు చేస్తుంది. ఈ కథకు ఈ భామ అయితే సరిగ్గా సరిపోతుందని నిర్మాతలు భావిస్తున్నారట. త్వరలో సినిమాను పట్టాలెక్కించి వచ్చే యేడాది ఆరంభంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. కాగా సంతోష్ శోభన్ ఇప్పటికే ‘తాను-నేను’, ‘పేపర్ బాయ్’ సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక ప్రభాస్ కెరియర్ లో ఫస్ట్ బిగెస్ట్ హిట్ అంటే టక్కున చెప్పే పేరు ‘వర్షం’. ఈ చిత్రాన్ని తెరకెక్కించింది దర్శకుడు శోభన్.

Related posts