telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ రూమర్లు పచ్చి అబద్ధం

Renu-Desai

పవన్ కళ్యాన్ నటిస్తోన్న బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమాలో తాను నటిస్తున్నానంటూ వస్తోన్న వార్తలను నటి రేణూ దేశాయ్ తీవ్రంగా ఖండించింది. ‘ఇది పచ్చి అబద్ధం. అసలు రూమర్లు స్టార్ట్ చేసే ఇంత సమయం వారికి ఎలా ఉంటుంది. ఇటువంటి వారి తీరుని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది’. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలోనూ రూమర్లు రావడం పట్ల తాను ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం కరోనా వైరస్.. ఫుల్లుగా స్ప్రెడ్ అవుతుందని.. అందరూ దయచేసి జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరింది. అలాగే మేమందరం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వీడియోలో తెలిపింది. అందులోనూ ముఖ్యంగా ఇంట్లో పెద్దవారిని బాగా చూసుకోవాలని, ఎందుకంటే వారికే ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందని.. కొంచెం అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రికి వెళ్లాలని తెలిపింది. కాగా తన కూతురు ఆధ్యా స్కేటింగ్, పెయిటింగ్, డ్రాయింగ్‌తో చాలా బిజీగా ఉందని తెలిపింది.

Related posts