telugu navyamedia
సినిమా వార్తలు

నీ విరహంలో…!

na varija netri poetry corner

నీ నగుమోములో
ఏదో  క్రొత్తదనం
నీ చిరునవ్వులో
ఏదో చిలిపితనం
నీ ప్రతి భంగిమలో 
నులివెచ్చదనం
నీ వాలుచూపులో
ఏదో మత్తుదనం
నీ చిలకపలుకులలో
వెన్నెల చల్లదనం
నను పిచ్చెక్కిస్తున్నాయి ప్రియా !
చెలి! చెంతకు చేరవా..?
విరహపు చింతను తీర్చవా ?

-కయ్యూరు బాలసుబ్రమణ్యం, 
శ్రీకాళహస్తి

Related posts