telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాహుల్ గాంధీ ఎప్పటికైనా ప్రధాని అవుతారు… దీపికా వీడియో వైరల్

Deepika-Padukone

బాలీవుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ కోణం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దీపికాను ఎన్‌సీబీ విచారణకి పిలిచింది. సుశాంత్ టాలెంట్ మేనేజర్ జయసాహాతో చేసిన వాట్సాప్ చాట్ నిజమే కానీ, తాను డ్రగ్స్ తీసుకోలేదని హీరోయిన్ దీపికా వెల్లడించిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఈ విచారణలో ఆమె కన్నీరు పెట్టుకుందట. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు అబద్ధమని, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాటికి దూరంగా ఉంటానని ఆమె వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పటికైనా ప్రధాని అవుతారంటూ దీపికా పదుకునే చేసిన వాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 2017లో ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వాఖ్యలు చేశారు. ఈ వీడియోలో దీపికా పదుకునే మాట్లాడుతూ.. “దేశం కోసం రాహుల్ గాంధీజీ చేస్తున్న పనులు ఆయనను మంచి ఉదాహరణలా నిలుపుతున్నాయని అన్నారు. ఏదో ఒక రోజు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పుకొచ్చింది దీపికా. రాహుల్ యువతతో బాగా కనెక్ట్ అవుతారని, భవిష్యత్‌లో అతను దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయని, తనకు చాలా నమ్మకం ఉందని దీపికా పేర్కొంది. అంతేకాకుండా తనకి ఇష్టమైన నేతల్లో రాహుల్‌ ముందుంటారని చెప్పుకొచ్చింది. అదే సమయంలో ఆయన ఫూచరిస్టిక్‌ కూడా అని దీపికా పేర్కొంది.

Related posts