telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బేర్ గ్రిల్స్ తో అక్షయ్ కుమార్… “ఇంటూ ది వైల్డ్” ప్రోమో వైరల్

Akshay

సాహసికుడు బేర్ గ్రిల్స్ చేసే మనుగడ పోరాటాలు డిస్కవరీ చానల్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరిట ప్రసారం అవుతుంటాయి. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. మాజీ సైనికుడు బేర్ గ్రిల్స్ తాను మాత్రమే కాదు, అప్పుడప్పుడు ప్రపంచ ప్రముఖులను కూడా వెంటబెట్టుకుని వెళ్లి ‘ఇంటూ ద వైల్డ్’ పేరిట అడవుల్లో సాహసాలు చేస్తుంటాడు. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఎపిసోడ్ చేసిన బేర్ గ్రిల్స్ కొన్నివారాల కిందట తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కర్ణాటక అడవుల్లో కార్యక్రమం పూర్తి చేశాడు. తాజాగా అక్షయ్ కుమార్ కూడా ఇందులోకి వెళ్లారు.ఈ కార్యక్రమం డిస్కవరీ ప్లస్ యాప్ లో సెప్టెంబర్ 11న విడుదల కానుంది. సెప్టెంబర్ 14న డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం కానుంది. గతంలో ఇందుకు సంబందించిన ప్రోమోను విడుదల చేసారు. తాజాగా అక్షయ్ తన ట్విట్టర్ ద్వారా మరోప్రోమోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ ప్రోమో వీడియో వైరల్ గా మారింది.

Related posts