telugu navyamedia
సినిమా వార్తలు

పాన్ ఇండియా సినిమాకు రామ్‌ పోతినేని గ్రీన్ సిగ్నల్​..

యంగ్‌ హీరో రామ్‌ పోతినేని పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చారు. ..మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను- హీరో రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.

దర్శకుడిగా బోయపాటికి ఇది 10వ సినిమా కాగా.. రామ్‌కు ఇది 20వ సినిమా. బోయపాటి, రామ్ కలయికలో తొలి చిత్రమిది. బోయపాటి శ్రీను, రామ్ కలయికలో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

Official: Ram Pothineni And Boyapati Srinu Tie Up For Pan India Movie - Sakshi

ప్రస్తుతం రామ్.. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఇది పూర్తయిన తర్వాత బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు పెట్టనున్నాడట.

Ram, Boyapati Movie with Lavish Budget

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో, ఉన్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించనున్నట్టు శ్రీనివాసా చిట్టూరి వెల్లడించారు. త్వరలోనే ఇతర వివరాల్ని వెల్లడిస్తాం’’ అన్నారు. 

Related posts