సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్నారు.ఓటమి తర్వాత టీడీపీ అవినీతి చిట్టా బయటపెడతామని స్పష్టం చేశారు. ఐదేళ్లపాటు మోదీ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మళ్లీ ఆయన ప్రభుత్వానికే పట్టం కట్టనున్నారని తెలిపారు.
ఇప్పటి వరకు టీడీపీ నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకున్నారన్నారు. అధికార బలంతో చంద్రబాబు అవినీతిని. ప్రోత్సహించారని దుయ్యబట్టారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ నేతలకు గడ్డుకాలమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు అహర్నిశలు శ్రమించిన ప్రధానిగా మోదీకి పేరుందన్నారు. ప్రస్తుతం ఓట్ల శాతాన్ని చూస్తుంటే బీజేపీకి అనుకూలమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకున్నా ఇక దాగదన్నారు.