telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చిన్న పిల్లలు మొబైల్ వాడుతున్నారా.. అయితే ఆ ప్రమాదం తప్పదు!

 ప్రస్తుతం సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు, సెల్ ఫోన్ వాడని వ్యక్తి లేడు. పెద్దవాళ్ళ కన్నా పిల్లల సెల్ ఫోన్ల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. అన్నం తినాలంటే సెల్ ఫోన్ ఉండాల్సిందే, ఏడుపు ఆపాలంటే సెల్ ఫోన్ ఉండాల్సిందే, ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా సెల్ ఫోన్ లేనిదే పిల్లలు ఏమీ చేయడం లేదు.అయితే పసి పిల్లలకు సెల్ ఫోన్ తలకు, చెవికి దగ్గరగా వాడితే ఏమైనా ప్రమాదం ఉందా! అని చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. ఆ అసలు నిజం ఏంటో మీరే తెలుసుకోండి.

రేడియేషన్_తప్పనిసరిగా_కావాలి

          మనం సెల్ ఫోన్ నుండి అవతలి వ్యక్తితో ఫోన్ లో మాట్లాడాలన్నా, మనం పంపించే మెసేజెస్ అవతలి వ్యక్తికి చేరాలన్నా రేడియేషన్ అనేది అవసరం. ఇది ప్రతి మొబైల్ కు కూడా అవసరమే. ఈ రేడియేషన్ అనేది సెల్ ఫోన్ టవర్ నుండే కాకుండా సెల్ ఫోన్ నుండి కూడా విడుదల అవుతుంది. బయటకు కనిపించకపోయినా మొబైల్ వేడి అవుతుండటం, మొబైల్ వాడే కొద్దీ శరీరానికి హీట్ గా అనిపిస్తుండటం దీని లక్షణాలు.

పిల్లలకు_ప్రమాదమా..!

            సెల్ ఫోన్ ను ఎక్కువగా తలకు, చెవులకు దగ్గరగా వాడటం సహజమే. ఇది పెద్దలకు ఫర్వాలేదు కానీ పిల్లలకు మాత్రం చాలా డేంజర్. ఎందుకంటే ఇందులో నుండే విడుదలయ్యే రేడియేషన్ కారణంగా బ్రెయిన్ పై ప్రభావం చూపెడుతుంది. చెవిపోటుకు కారణమవుతుంది. అధిక రేడియేషన్ కారణంగా నోటిలో గడ్డలు కట్టే ప్రమాదం ఉంది. అలాగే వారి ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుంది. అందుకని వీలైనంత వరకు వారి తలకు, చెవులకు దూరంగా ఉంచడం చేయాలి. రేడియేషన్ కారణంగా క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు, కానీ నిరూపితం కాలేదు కాబట్టి ఎందుకైతేనేం మీ పిల్లలకు దూరంగా పెట్టడమే మంచిది.

పిల్లలు_ఫోన్_కావాలంటే_ఇలా_చేయండి

                 సహజంగా మీరు చెవికి దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం వలనే పిల్లలు కూడా అలా మాట్లాడాలని తలకు దగ్గరగా పెట్టుకోవడం జరుగుతుంది. అందుకని మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం, లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడితే వారు కూడా అలానే చేస్తారు. ఇలా చేయడం వలన రేడియేషన్ ప్రభావం ఉండదు. అలాగే మార్కెట్ లో రేడియేషన్ తక్కువగా ఉండే మొబైల్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి వాటినే అడిగి మీకు నచ్చింది తీసుకోండి.

 

 

Related posts