కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ఇప్పటికే, పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్ల భారీ విరాళం అందజేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షల చొప్పున ఇచ్చారు. అలాగే, రామ్ చరణ్ కూడా రూ.70 లక్షల విరాళం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు వీరి జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు మహేష్ బాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. ‘‘కోవిడ్ 19పై కలిసికట్టుగా పోరాడదాం. మన ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలను పాటిద్దాం. ప్రధాన మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నానికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఈ యుద్ధంలో విజయం సాధిస్తాం’’ అని మహేష్ ట్వీట్ చేశారు.
previous post