telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

తులసి ఆకులను దంచి ఇలా చేస్తే…

భారతీయ సంస్కృతిలో తులసి మొక్కకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటి యందు తులసి మొక్కని తప్పనిసరిగా పూజిస్తారు. తీర్ధప్రసాదాలలో కూడా తులసి భాగమై ఉన్నది. ఇన్నిరకాలుగా ఉపయోగించే తులసి నందు అత్యద్భుతమైన ఔషధ గుణాలు కలవు. ఇప్పుడు వాటిని మీకు వివరిస్తాను.

తులసి ఆయాసం , దగ్గులను తగ్గిస్తుందని చరకసంహిత నందు చెప్పబడినది. జ్వరములను తగ్గించుటలోను , చర్మరోగములను తగ్గించడంలోనూ కూడా తులసి బాగా పనిచేస్తుంది . అంతే కాకుండా తులసి ఉత్తేజాన్ని ఇచ్చును. జీర్ణకారి , ఆస్తమా , కోరింతదగ్గు మొదలగువాటిలో బాగుగా పనిచేయును . నులిపురుగులు , తేలుకాటు మొదలగు విషజంతువుల విషనివారణ కొరుకు కూడా బాగా పనిచేయును . సాంక్రమిక వ్యాధులలో కూడా తులసి బాగుగా పనిచేయును . ముఖ్యంగా మహామ్మారిలా వచ్చు ప్లేగు , కలరా వంటి వ్యాధులలో కూడా తులసి అత్యద్భుతముగా పనిచేయును .

తులసి మానసిక ఉద్వేగాన్ని తగ్గించి చక్కటి నిద్రని కలుగచేస్తుంది. తులసి ఆకుల పసరు తీసి అందులో తేనె కలిపి ఇచ్చిన విషజ్వరాలు తగ్గును. స్వచ్చమైన తులసి రసాన్ని పైకి మర్దన చేసిన ఒళ్లునొప్పులు , కీళ్లనొప్పులు , శిరోభారం తగ్గును. తులసి మొక్కలను ఎక్కువుగా పెంచడం వలన వాతావరణ కాలుష్యం వలన వచ్చు వికృతలను అరికట్టవచ్చు. తులసి రసము నందు మిరియాల పొడిని కలిపి ఇచ్చిన ఆస్తమా , కోరింతదగ్గు తగ్గును. తులసిరసం పైకి రాయటం వలన చర్మవ్యాధుల నివారణ జరుగును. బొల్లి మచ్చల పైన తులసిరసం రాయటం వలన మచ్చలు తగ్గును.

Related posts