telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెన్సార్ బోర్డుపై వర్మ ఫైర్ : ఎంతగా ఆపితే అంతగా పైకి లేస్తా… సీక్వెల్ కూడా…!

Ram-Gopal-Varma

వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. క్యాస్ట్ ఫీలింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు. ఇప్పటికే తనను కించపరిచేలా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా ట్రైలర్ ఉందని, ఆ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలని ప్రశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఇది వరకే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం విడుదలకు టీఎస్ హైకోర్టు బ్రేక్ వేసింది. చిత్ర విడుదలకు వీలులేకుండా ఈరోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో సినిమాను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా సినిమా టైటిల్ ఉందని, దాన్ని మార్చాలని సూచించింది. శుక్రవారం విడుదల కావలసిన ఈ చిత్రం సెన్సార్‌ వివాదంతో వాయిదా పడింది. వర్మ మాట్లాడుతూ మొదటిసారి నా నుంచి వస్తున్న సందేశాత్మక చిత్రమిది. అక్కడ కులాల మధ్య విభేదాలు, వివాదాలు సృష్టించాలని కాదు. ఈ సినిమాతో దేన్నీ సీరియస్‌గా తీసుకోకూడదనే సందేశం ఇస్తున్నా. దీనికి సీక్వెల్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నా. కొన్ని కారణాల వల్ల టైటిల్‌ మార్చాం. సెన్సార్‌కి అప్లై చేసి చాలా కాలమైన సినిమా చూడకపోవడం బాధాకరం. ఇంకా పాత పద్దతుల్లోనే వ్యవహరిస్తున్న సెన్సార్‌ బోర్డ్‌ ఆప్‌డేట్‌ కావాలి. వారి నిర్ణయం తెలిపాక విడుదల తేదీని ప్రకటిస్తా’’ అని అన్నారు. ‘‘ఓటు వేసి ఎలాంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలో అన్న జ్ఞానం ప్రజలకు ఉంది. ఏ సినిమా చూడాలి? దేన్ని చూడకూడదు అన్న విషయంలోనూ జనాలకి క్లారిటీ ఉంది. ఇద్దరు ముగ్గురు సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు సినిమా చూసి మనకు చెప్పాలా? సెన్సార్‌ అనేది కాలం చెల్లిన వ్యవస్థగా మారింది. దాని గురించి మాట్లాడుకోవడం వృధా’’ అని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. ఆడియన్స్‌కు ట్రైలర్‌ నచ్చితే సినిమా ఎంత ఆలస్యంగా రిలీజ్‌ అయినా చూస్తారు. నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తాను అందుకే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాను`అన్నాడు.

Related posts