ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి, అలసట సర్వసాధారణం అయిపోయాయి . అయితే, ఒత్తిడి మన మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. ఖర్జూర పండ్లు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాడు. ఖర్జూర పండ్లలో భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మీ ఎముకలకు బలం చేకూరుస్తాయి. పిండం
పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. పండ్లలోని తేమను బట్టి ఖర్జూరాల్ని మెత్తనివి, కాస్త ఎండినట్లుగా ఉండేవి, పూర్తిగా ఎండినట్లుగా ఉండేవి అని మూడు రకాలుగా విభజించారు. పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ప్రత్యేకించి పిల్లలకు, సాధారణంగా పెద్దలకు వేసవిలో శక్తినివ్వటానికి వాడవచ్చు.
రోజూ నానబెట్టిని డేట్స్ ను ఒకటి రెండు తినడం వల్ల ఇన్ స్టాంట్ ఎనర్జీ వస్తుంది. విటమిన్ సప్లిమెంట్ తీసుకునే అవకాశం ఉండదు. గ్లోకోజ్, ఫ్రక్టోజ్ వంటి నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల ఇవి ఎనర్జీ లెవల్స్ ను మార్చుతుంది.
ఖర్జూరంతో అద్భుత ప్రయోజనాలు:-
* ఖర్జూర పండ్లలో కొలెస్ట్రాల్, చక్కెర తక్కువగా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు. చక్కెర శాతం తక్కువగా ఉండటం చాలా ప్రయోజనకరం. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే పండ్లలో ఖర్జూరం కూడా ఒకటి.
* ఆయుర్వేదానికి అనుగుణంగా, ఖర్జూరం.. అనేక వ్యాధులను నయం చేసే అద్భుత ఔషధం. శారీరక బలహీనత, లో బీపీ, గుండె జబ్బులు అధిక దాహం వంటి సమస్యలతో పోరాడటానికి ఖర్జూర పండ్లు ఉపయోగపడతాయి.
* ఖర్జూర పండ్లలో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవడంతో సాయపడతాయి. డేట్స్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి.
* మీరు ప్రతి ఉదయం 2 డేట్స్ తినడం ప్రారంభిస్తే.. ఈ అలవాటు వల్ల కలిగే ప్రయోజనాలు అతి కొద్ది రోజుల్లోనే స్పష్టంగా కనిపిస్తాయి. ఖర్జూర పండ్లలో అధిక స్థాయిలో ఇనుము ఉంటుంది. బ్రీతింగ్ సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలను కూడా ఎదుర్కొనడంలో కూడా డేట్స్ బాగా ఉపకరిస్తాయి.
*ఖర్జూర తినడము వలన మలబద్ధకం తగ్గుతుంది, ఎముకలు బలంగ తయారవుతాయి, ఉదర క్యాన్సర్ తగ్గుతుంది. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్ చక్కగా ఉపయోగపడుతుంది.గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్ మంచి మందు.
*కర్జూరంలో అధికంగా విటమిన్ ఎ తో పాటు ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ రేచీకటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. కాబట్టి కర్జూరం నుండి ఎ విటమిన్ తీసుకోవడం చాలా అవసరం.
* గర్భిణీలకు ఫోలిక్‌యాసిడ్ చాలా అవసరం. అది ఇందులో మెండుగా ఉంది. కాబట్టి గర్భణీ స్త్రీలు కర్జూరం ను తరచూ తీసుకొంటుండాలి. ముఖ్యంగా గర్భిణీలు ఖర్జూరాలు తింటే ఐరన్ బాగా దొరుకుతుంది. ఎందుకంటే 100 గ్రాముల ఖర్జూరాల్లో 7.3 మిగ్రా ఐరన్ ఉంది.
*ఇంకా హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మహిళలకు కూడా కర్జూరం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కర్జూరం పండులో క్యాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్, మరియు సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఈ కనిజలవణాలు, గర్భంలోని పిండం పెరుగుదలకు చాలా అవసరం.