telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా బాధితులకు మెరుగైన సేవలు: కేసీఆర్

Kcr telangana cm

కరోనా బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలను అందిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువ మందికి చికిత్స అందుతోందని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా మహమ్మారి గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.

కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రం గందరగోళంలో ఉండేదని అన్నారు. అదే సమయంలో తెలంగాణలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లామని తెలిపారు. కరోనాతో సహజీవనం చేయక తప్పదని అన్నారు. తెలంగాణలో ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా చికిత్సలను అందిస్తున్నామని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడానికి రూ. 100 కోట్లను కేటాయించామని తెలిపారు.

Related posts