telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ట్విట్ట‌ర్ చ‌ర్య‌ల‌ను వివ‌రించేందుకు స్టాండింగ్ క‌మిటీ ఏర్పాటు…

తాజాగా భారత ప్రభుత్వం జారీ చేసిన ఐటీ మార్గ‌ద‌ర్శకాల‌ను ట్విట్ట‌ర్ అంగీక‌రించ‌లేదు. గ‌డువు దాటిన త‌రువాత సెంట్ర‌ల్ కంప్ల‌యిన్స్ ఆఫీస‌ర్‌ను ఏర్పాటు చేయ‌డంపై కేంద్రం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. కేంద్రం ఏర్పాటు చేసిన పార్ల‌మెంట్ స్టాండింగ్ క‌మిటీ ముందు ట్విట్ట‌ర్ ప్ర‌తినిధులు హాజ‌రుకాబోతున్నారు. శ‌శిథ‌రూర్ ఆధ్వ‌ర్యంలో ఐటీ వ్య‌వ‌హారాల‌పై ఓ క‌మిటీని ఏర్పాటు చేశారు. ట్విట్ట‌ర్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించేందుకు ఈ స్టాండింగ్ క‌మిటీని ఏర్పాటు చేశారు. కాగా, జ‌న‌వ‌రిలో కేంద్రం ట్విట్ట‌ర్‌కు స‌మ‌న్లు జారీ చేసింది. అయితే, అప్ప‌ట్లో కొత్త నిబంధ‌న‌లు అనుస‌రించేందుకు ట్విట్ట‌ర్ నిరాక‌రించింది. క‌రోనా కార‌ణంగా పూర్తి చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు స‌మ‌యం కావాల‌ని ట్విట్ట‌ర్ కోరింది. అయితే, ఫిబ్ర‌వ‌రిలో కేంద్రం కొత్త నైతిక మార్గద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలపై ట్విట్ట‌ర్ అభ్యంత‌రం తెలిపింది.

Related posts