telugu navyamedia
రాజకీయ వార్తలు

పాక్ ఉగ్రవాదుల వద్ద చైనా ఆయుధాలు!

kashmir police firing

పాకిస్థాన్ కు చైనా సహకారాన్ని అందిస్తోందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చైనా ఆదేశాల మేరకు భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ కొత్తగా గన్ పాయింట్స్ ను ఏర్పాటు చేసుకుంది. ఇదే సమయంలో చైనా నుంచి తీసుకున్న మానవ రహిత విమానాలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రారంభించింది.

నిఘా వర్గాల సమాచారం మేరకు, పాక్ స్పై ఏజన్సీ ఐఎస్ఐ కి చైనా నుంచి ఆదేశాలు అందాయి. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లోకి భారీ ఎత్తున ఆయుధాలను తరలించాలని చైనా సూచించడంతో అందుకు తగ్గట్టుగా పాక్ సన్నాహాలు ప్రారంభించింది.

ఇటీవలి కాలంలో వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ సైన్యం కార్యకలాపాలు పెరిగిపోయాయి. వీరి వెనుక చైనా కూడా ఉందని తేలిపోయింది. ఇటీవల జమ్మూకశ్మీర్ లో పట్టుబడిన సైన్యం వద్ద చైనాలో తయారైన ఆయుధాలు లభించడమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఈ నివేదికలను పరిశీలించిన తరువాత పాక్ సరిహద్దుల్లో మరింత నిఘాను పెట్టాలని హోమ్శాఖకు ఆదేశాలు అందడంతో సైన్యాన్ని కూడా అప్రమత్తం చేశారు.

Related posts