భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమర్‌నాథ్ వార్షిక యాత్ర జూలై ఒకటి నుంచి ప్రారంభం కానుంది. హిమాలయాల్లో కొలువై ఉన్న అమర్‌నాథుణ్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరుతారు. ఈ మేరకు అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
బల్తాల్, పహల్గామ్ మీదుగా రెండు మార్గాల్లో సాగే 40 రోజుల అమర్‌నాథ్ యాత్రకు సీఆర్పీఎఫ్‌తోపాటు కశ్మీర్ పోలీసులు బందోబస్తులో పాల్గొంటారు. తీర్థయాత్ర సందర్భంగా భద్రతా ప్రమాణాలను తుచ తప్పకుండా పాటించాలని హోం మంత్రి అమిత్ షా అధికారులకు సూచించారు.