telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజీనామా లేఖతో ఎమ్మెల్యే హరీశ్రావు, గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది.

మాజీ మంత్రి హరీష్రావు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య  మాటల యుద్ధం సాగుతోంది. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

బీఆర్ఎస్ శ్రేణులు భారీగా గన్ పార్క్ వద్దకు చేరుకుంటున్నారు, పోలీసులు భారీగా మోహరించారు. గన్పార్క్ వద్ద అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు.

మాజీ మంత్రి హరీష్రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు, అమరవీరుల స్థూపం దగ్గరకు రేవంత్ రెడ్డి కూడా రావాలని, ఆయన కూడా రాజీనామా పత్రం తీసుకురావాలన్న హరీష్.

రేవంత్ రెడ్డి పెట్టిన ఒట్లు నిజమైతే రావాలి లేదంటే దొంగ ఒట్లు అని తేలినట్టే అంటూ వ్యాఖ్యానించారు.

ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించగా, అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయాలని హరీష్రావు డిమాండ్ చేశారు.

దమ్ముంటే నువ్వూ అక్కడికి రా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే బాండ్ పేపర్ల మీద రాసిన గ్యారంటీలు అమలు చేసే మాట నిజమైతే గన్ పార్క్ వద్దకు రా.

ఇద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతు ల్లో పెడదాం అంటూ రేవంతుకు హరీష్రావు సవాలు విసిరారు.

ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేస్తే నా రాజీనామా లేఖను మేధావులు తీసుకెళ్లి
స్పీకర్ ఇస్తారు. ఒకవేళ అమలుకాకపోతే నీ రాజీనామా లేఖను గవర్నర్కు ఇస్తా రు.

Related posts