ఏపీలో పెట్టుబడిదారులపై సీమ్ వైఎస్ జగన్ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వేధింపులు రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టివేస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా తమ ఒప్పందాల భవిష్యత్ ఏంటని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారన్నారు.
పెట్టుబడిదారుల మనసుల్లో తీవ్ర అలజడి రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు. నిరంకుశ ధోరణితో, ఏకపక్షంగా కాంట్రాక్టులు రద్దు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడిచేసేలా కేంద్రం చట్టం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాను స్వాగతిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
సీఎం జగన్ ఫ్యాక్షన్ నేతగా వ్యవహరిస్తున్నారు: గోరంట్ల