telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కలమే.. ఆయుధం..!

ఈ కలం కవి చేతిలో
ఆయుధమై ఎన్ని నిజ గాధలు
విషాద గాధలు ప్రేమ గాధలు
వ్రాసిందో నేడు రూపం మారింది
ఆ శాప ఫలమో..! విధి విధానమో
తెలియకున్నదీ హాస్య కధలు
వ్రాయాలని కవి అనుకుంటే
విషాద కధలకు దారితీసింది
ఆ విధాత కవి మనసులో
చేరి కలము వ్రాతను మార్చాడా..!
లేక విధి వ్రాతను మార్చి
తానే వ్రాసాడా ఆ విధాత
అది కవి మనసున మెదలిన
భావమో పేదవాని నుదిటిన విధాత
వ్రాసిన ప్రేరణయో తెలియకున్నది
కవి నుదిటిన విధాత వ్రాసిన లిఖితమో

Related posts