నేటి ఆహార అలవాట్లతో అధిక కొవ్వు, బరువుతో చాలా మంది బాధ పడుతున్నారు. దీంతో ఆ సమస్యల నుండి బయటపడేందుకు కొంతమంది వాకింగ్‌లు, జాగింగ్‌లు చేస్తున్నారు. ఒక రకంగా ఇది మంచిదే అయినా.. ఫలితం రావడానికి కాస్త సమయం పడుతుంది. మరికొంతమంది.. హాస్సిటల్స్‌లో చికిత్సలు తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నది. వీటి ద్వారా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మన ఆరోగ్యానికి ఎలాంటి రిస్క్ లేకుండా.. వారం రోజుల్లోనే ఫ్రూట్స్ తిని.. హ్యాపీగా కొవ్వును కరిగించుకోవచ్చు.
ఇలా ఓ వారం రోజులు , రోజుకు మూడు పూటలా.. పండ్లే తినాలి. అది కూడా.. మన ఆకలి తీరేవరకూ తినవచ్చు. ఉదయం లేవగానే.. ఒక లీటర్ గోరు వెచ్చిన నీరుని.. తీసుకోవాలి. ఒకటేసారి తీసుకోవడం కష్టంగా ఉంటే. ఐదు, పది నిమిషాలకొకసారి తాగవచ్చు. ఆ తరువాత.. వ్యాయామం చేసి, టిఫిన్ తినే సమయంలో మీకు ఇష్టమైన ఫ్రూట్స్ తినవచ్చు లేదా జ్యూస్ రూపంలో అయినా తాగవచ్చు. మధ్యాహ్నం భోజనం టైంలో కూడా అన్నం మానేసి కేవలం ఫ్రూట్స్‌ని మాత్రమే తినాలి. ఓ గంట తర్వాత నీరు త్రాగాలి. అలాగే రాత్రి 7 గంటల లోపు ఫ్రూట్స్ లేదా జ్యూస్‌ని తీసుకోవాలి. ఓ గంట తర్వాత నీటిని త్రాగాలి. మీరు ఆహారంగా ఏ ఫ్రూట్స్‌నైనా తినవచ్చు. ఇలా ఓ వారం రోజులు గనుక చేస్తే.. మీ కొవ్వును ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. అలాగే బాన పొట్ట కూడా తగ్గిపోతోంది. వారివారి శరీర స్థితిలను బట్టి నిపుణుల సలహా మేరకు ఆయా పండ్లు తీసుకోవటం తో ఖచిత ఫలితం పొందవచ్చు.