telugu navyamedia
క్రీడలు వార్తలు

టీంఇండియాలో మంచి బ్యాకప్ ఆటగాళ్లు ఉన్నారు : పుజారా

టీమిండియా జూన్ 2న ఇంగ్లాండ్‌ పర్యటకు వెళ్లనుంది. సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఛాంపియన్‌షిప్ జరగనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనంతరం నెలరోజుల పాటు అక్కడే ఉండి కోహ్లీసేన ప్రాక్టీస్ చేయనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌లో ఢీకొట్టబోతోంది. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో తాజాగా చతేశ్వర్ పుజారా మాట్లాడుతూ… ‘ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా కచ్చితంగా విజయాల్ని సాధిస్తుంది. గత కొన్ని నెలల నుంచి విదేశాల్లో జట్టు మెరుగ్గా రాణిస్తోంది. దాంతో జట్టు‌లో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. ప్రణాళికల్ని చక్కగా అమలు చేయగలిగితే.. తప్పకుండా ఇంగ్లీష్ గడ్డపై ఆధిపత్యం చెలాయించగలం. టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ని తటస్థ వేదికపై ఆడుతున్నాం. కాబట్టి రెండు జట్లకీ గెలిచేందుకు సమాన అవకాశాలుంటాయి. ఒకవేళ మేము మా స్థాయికి తగినట్లుగా ఆడితే.. ప్రపంచంలోని ఏ జట్టునైనా, ఎక్కడైనా ఓడించగలం’ అని అన్నాడు. గత పది సంవత్సరాలలో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ బెంచ్ సామర్థ్యం పెరిగింది. ప్రస్తుతం చాలా మంది బ్యాకప్ ఆటగాళ్లు ఉన్నారు. అందుకు ఆసీస్ సిరీస్ మంచి ఉదాహరణ. స్టార్ ఆటగాళ్లు గాయాలపాలైనా.. కుర్రాళ్లు అదరగొట్టారు. ఇది మంచి పరిణామం అని పేర్కొన్నారు.

Related posts