హైదరాబాద్ మహానగరాన్ని జలప్రళయం అతలాకుతలం చేసింది. అనేక మంది చనిపోయారు. నివాసాలు కూలిపోయాయి. రోడ్లు, ఇతర వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. దాతలు విరాళాలు ఇవ్వాలని కోరింది. దీంతో అనేక మంది ప్రముఖులు, సినీ హీరోలు, దర్శక నిర్మాతలు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా వరద బాధితులను ఆదుకునేందుకు రామోజీ గ్రూప్ సైతం ముందుకొచ్చింది. వరద బాధిత సహాయార్థం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 5 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ చెక్కును రామోజీ గ్రూప్ సంస్థల ప్రతినిధి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కి అందచేశారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) సైతం భారీ విరాళం ప్రకటించిని విషయం తెలిసిందే. వర్షాల వల్ల నష్టపోయిన తెలంగాణ ప్రజలను ఆదుకోవడానికి ముందుకొచ్చిన మేఘా సంస్థ రూ. 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు.
previous post