telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రఘురామకృష్ణరాజు తో పాటు రెండు ప్రముఖ ఛానెళ్ల పై కేసు నమోదు : సీఐడీ

Raghuramakrishnaraju ycp mp

పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడు తున్న కేసులో A1గా రఘురామ కృష్ణ రాజు, A2, A3గా ప్రముఖ ఛానెళ్లను సీఐడీ ఎఫ్‌ఐఆర్లో పేర్కొంది. కుల, మత, వర్గాలను టార్గెట్‌ చేసుకుని, ప్రముఖ ఛానెళ్లతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కృష్ణ రాజు కుట్ర చేసినట్టు సీఐడీ పేర్కొంది. ఆ ప్రముఖ ఛానెళ్ల రఘురామకృష్ణరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించారని .. ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషం జిమ్మించాయని సీఐడీ తెలిపింది.

మరి ఒక ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు అన్న వారిపై .. చంద్రబాబుకి అంతిమ ఘడియలు అన్న వారిపై .. పోలీసుశాఖలో కీలకమైన పోస్టులన్ని చంద్రబాబునాయుడ్డ సామాజిక వర్గంతో నింపేశారు, 33 మంది డి ఎస్ పి లలో 32 మంది కమ్మవాళ్లే అని అబద్దాలు నిస్సిగ్గుగా ప్రకటించిన ఎ2 పై .. ఒక సామాజిక వర్గం కోసం అమరావతి అని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన వారిపై .. కరోనానా కమ్మరోనానా అన్న నేతలపై .. రాజ్యాంగ పదవిలో ఉన్న ఎస్ ఈ సి పై కులపరమైన విమర్శ చేసిన వారిపైనా ఇదే సెక్షన్లతో కేసులు పెట్టి తమరి నిస్పాక్షికతను ఎలుగెత్తి లోకానికి చాటి చెప్పండి సీఎం జగన్ అని అన్నారు.

Related posts