telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అసోం లో .. నదిలో బోల్తాపడ్డ పడవ.. 80 మంది గల్లంతు…

boat sank in river 80 passengers in trouble

ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కుందామని సంతకు వెళ్లివస్తుండగా ప్రమాదం కబళించింది. తమకు తెలిసిన వారితో సరుకులు కొందామని వెళ్లి నది మధ్యలో పడవ బోల్తాపడటంతో గల్లంతయ్యారు. వీరిలో కొందరు ఈత వచ్చిన వారు ఒడ్డుకు రాగా.. మరికొందరు జాడ తెలియలేదు. వెంటనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. అసోం జిల్లా సోనిట్‌పూర్ జియా భారలీ నదీలో పడవ బోల్తా పడింది. ఇందులో 80 మంది ప్రయాణిస్తున్నారు. బిహియా గావ్ నుంచి లాల్ టాపుకు వెళ్తున్నారు.

లాల్ టాపులో ప్రతీ గురువారం సంత ఉంటుంది. ఈ సంత కోసం చుట్టుపక్కవారు చాలా మంది వస్తుంటారు. అలా వస్తున్న కొందరు నదీమార్గాన్ని ఎంచుకోవటంతో ప్రమాదవశాత్తు పడవ బోల్లా పడింది. బిమియా గావ్ నుంచి కూడా 80 మంది సంతకు వస్తూ ఈ ప్రమాదంలో ఇరుక్కున్నారు. నదీ మధ్యలో పడవ వెళ్తుంది. పడవలో 80 మందితోపాటు.. కొన్ని టూ వీలర్ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పడవ బోల్తా పడింది. దీంతో ఈత వచ్చిన కొందరు ఎలాగోలా ఒడ్డుకు చేరుకోగలిగారు. మిగతా వారు మాత్రం గల్లంతయ్యారు. పడవ ప్రమాదం విషయం తెలుసుకొని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దిగింది. నదిలో గల్లంతైన వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది.

Related posts