telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సెల్ ఫోన్లకు నో పర్మిషన్…స్పీకర్ ఆంక్ష‌లు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి.

ఈ క్ర‌మంలో  స్పీకర్‌ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో కొత్త రూల్‌ ప్రవేశపెట్టారు. అసెంబ్లీలోకి సభ్యులు ఎవ్వరూ మొబైల్, ప్లాకార్డులు, రెచ్చగొట్టే ఇతర కార్యక్రమాలు చేపట్ట వద్దని రూల్ నెంబర్ 317లో చేర్చనున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

అయితే, స్పీకర్ రూలింగ్‌పై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. సభలో జరుగుతున్న పరిణామాలను సెల్ ఫోన్‌తో రికార్డు చేసి మీడియాకు టీడీపీ సభ్యులు చేరవేస్తున్నారని  -అన్నారు,  దీనిపై  కచ్చితమైన సమాచారం తమకు ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు స్పీకర్‌.

అయితే, వైసీపీ సభ్యులు కూడా సెల్ ఫోన్లు తీసుకువస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు వాదించారు.. ఇకపై ఈ రూల్‌ అందరికీ వర్తిస్తుందని.. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలని స్పీకర్‌ తమ్మినేని పేర్కొన్నారు.

మరోవైపు, మార్షల్స్ నెట్టేస్తున్నారన్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు టీడీపీ సభ్యులు.. అయితే, మార్షల్స్ వారి విధులను వాళ్లు నిర్వహిస్తున్నారని స్పీకర్‌ స్పష్టం చేశారు.

Related posts