telugu navyamedia
రాజకీయ

అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మ‌హిళా కమలా హ్యారిస్‌..

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన అధికారాలను ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించనున్న‌ట్లు వైట్ హౌస్ తెలిపింది.  జో బిడెన్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌లో రొటీన్ కోలనోస్కోపీ పరీక్షకు వెళ్లినప్పుడు శుక్రవారం కొద్దిసేపు అధ్యక్షుడు జో బిడెన్ నుండి అధ్యక్ష అధికారాలను ఆమెకు ఇవ్వ‌నున్నారు. పెద్ద పేగుకు సంబంధించి బైడెన్​కు ప్రతి ఏటా కొలనోస్కోపీ పరీక్ష నిర్వహిస్తారు. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకోవ‌డం ఇదే మొద‌టి సారి.

ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి మాట్లాడుతూ.. కొలనోస్కోపీ సమయంలో బిడెన్ కు మత్తుమందు ఇస్తార‌ని, అందుకోసం తాత్కాలికంగా హారిస్‌కు అధికారాన్ని అప్ప‌గించ‌నున్నార‌ని చెప్పారు.సుమారు 11:35 గంటలకు హారిస్ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్‌తో మాట్లాడిన తర్వాత బిడెన్ తన విధులను తిరిగి ప్రారంభించినట్లు సాకి చెప్పారు.

అధ్యక్షుడు స్పృహలో లేనిపక్షంలో ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ సమయంలో కమలా హ్యారిస్‌ వైట్‌హౌస్‌ వెస్ట్‌వింగ్‌లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. పరీక్షల అనంతరం బైడెన్‌ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాలన్నీ మళ్లీ ఆయనకే సంక్రమించాయి.

Kamala Harris: కమలా హారిస్‌కి అమెరికా అధ్యక్ష బాధ్యతలు.. కారణాలు ఇలా ఉన్నాయి..?

దీంతో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే తొలి మహిళగా కమలా హారిస్‌ రికార్డు సృష్టించారు. 2002, 2007లో అప్పటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్‌ ఇలాగే కలనోస్కోపీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు సందర్భాల్లో తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీకి బదిలీ చేశారు.  

Related posts