telugu navyamedia
రాశి ఫలాలు

నవంబర్ 20, శనివారం రాశిఫలాలు..

మేష రాశి..

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారంలో జీవితభాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. నూతన కార్యక్రమాలను ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి. సమావేశాలలో మీకు గుర్తింపు, గౌరవం లభిస్తాయి.

వృషభ రాశి..

అధికారుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి తీసుకోవాలి. అన్ని రంగాల్లో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహనం నడిపే విషయాలలో శ్రద్ధ వహించడం మంచిది. ఉద్యోగయోగం ల‌భిస్తుంది.

మిధున రాశి..

వృత్తి, ఉద్యోగాల్లో, శ్రద్ధ చూపించాలి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. బంధు మిత్రులతో చర్చలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.

కర్కాటక రాశి..

సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ పూర్తిచేస్తారు. వ్యాపారపరంగా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి నూతన విద్యా విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దైవకార్యాలు, సభలు, సమావేశాలలో పాల్గొనడం వల్ల ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

సింహ రాశి..

నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ధ్యేయం కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి.విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి..

స్త్రీలు నూతన పరిచయాలు, బంధువర్గంలో సత్సంబంధాలు నెలకొంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల రాశి..

అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. సన్నిహితులతో చాలా కాలంగా ఉన్న వివాదాలను పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయాలలో చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి.

వృశ్చిక రాశి..

ప‌త్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. వాహనం నడుపునపుడు జాగ్ర‌త్త‌లు పాటించాలి అవసరం. ధన సంబంధ వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం వలన ఉన్నత పదవులు లభిస్తాయి.

ధనస్సు రాశి..

ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి వ‌ల‌న పనిభారం పెరుగుతాయి, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందు వినోద‌ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

మకర రాశి..

డ‌బ్బులు పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు.

కుంభ రాశి..

విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. చేపట్టిన పనులు జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహారించాలి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి.

మీన రాశి..

ప్రయాణాలు అనుకూలిస్తాయి. డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి.

Related posts