telugu navyamedia
రాశి ఫలాలు

అక్టోబ‌ర్ 26, మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు..

మేషరాశి
ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు వింటారు. ప్రారంభించే పనులలో ఆలస్య కానివ్వకుండా చూసుకోండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో అతి చనువుగా ఉండటం మంచిది కాదు. ఆర్థిక లాభాలు అనుకూలంగా ఉంటాయి. గొంతు సంబంధిత సమస్యలు ఉండవచ్చు.ఎదుటివారి ఆంతర్యాన్ని గమనించి ముందుకుసాగండి.

వృషభ రాశి
హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఆదా చేయడంపై దృష్టి పెడతారు.ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి.

మిథున రాశి
శ్రమకు మించిన ఫలితం ఉంటుంది. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. కొన్ని కీలక పనులను పూర్తి చేస్తారు. చేపట్టే పనులలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొన్ని కారణాల వల్ల మీరు చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే ఈ రోజు మీరు ఆ సమస్యకు పరిష్కారం పొందవచ్చు.ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రముఖులతో పరిచయం మీ ఉన్నతికి దోహదం చేస్తుంది.

కర్కాట‌క రాశి
ముఖ్యమైన విషయాలలో సంబంధిత పెద్దలను కలుసుకుంటారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉపాధ్యాయులకు పని భారం అధికమవుతుంది. తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగానే ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టే పనులలో విజయం సాధిస్తారు. కొంతమంది ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

సింహ రాశి
పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఓ శుభవార్త మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కన్య రాశి
ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. వ్యాపారాలలో మంచి లాభాలు అందుకుంటారు. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై యత్నాలు ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దలను కలుస్తారు.

తుల రాశి
స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి కొనుగోలు చేయుయత్నాలు వాయిదా పడతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అకస్మిక ప్రయాణాలు చేస్తారు. చేపట్టే పనులలో పురోగతి సాధిస్తారు.

వృశ్చిక రాశి
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు తక్కువగా ఉంటాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రయాణాలు ఉండే అవకాశం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మానసిక అశాంతి క‌లుగుతుంది.

ధనుస్సు రాశి
ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మీమీ రంగాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టే పనులు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన విషయాలు ఉత్సాహ పరుస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

మకర రాశి
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రయాణాలు తప్పవు. మీతో సఖ్యతగా నటించి తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. ఖర్చులు, కుటుంబ అవసరాలు మరింతగా పెరుగుతాయి. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఆలసట ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.

కుంభ రాశి
మీ అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పెట్టిన పెట్టుబడులలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి నిరుద్యోగులకుదూర ప్రాంతాల నుండి సదవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి

మీన రాశి
ఉద్యోగస్తులకు పదోన్నతి, కోరుకున్న చోటికి బదిలీ వంటి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు.

Related posts