మేషం : కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పాత అప్పుల నుంచి బయట పడతారు. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకంటారు
వృషభం : వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. బంధు మిత్రుల నుంచి ధన సహాయ విషయంపై ఒత్తిడి, మొహమ్మాటాలు ఎక్కువగా ఉంటాయి.
ఆర్థికంగా కొంత ప్రయోజనం ఉంటుంది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి.
మిథునం : ఈ రోజు ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరుల మధ్య ఒక అవగాహన ఏర్పడుంది. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాల్లో ఒత్తిడిలు ఎదుర్కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారికి ఆశాజనకంగా ఉంటుంది. దంపతులు ప్రతి విషయంలోనూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో జాగ్రత్త వహించండి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు.
సింహం : ఈ రోజు మీరు ఆదాయానికి మించిన ఖర్చులు వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు అనుకూలమైన రోజు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సామర్ధవంతంగా ఎదుర్కొంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు, వ్యాపార, ఉద్యోగాల్లో ఉత్సాహం ఉంటుంది.
తుల : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు విలాస వస్తువులు, ఆడంబరాలు పట్ల ఆసక్తి కనబరుస్తారు. వస్త్ర, బంగారం వ్యాపారులకు అనుకూలం. క్రయ విక్రయాలు మందకొడిగా ఉంటాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. వ్యవసాయ కూలీలకు ఆశాజజనకంగా ఉంటుంది.
ధనస్సు : ఈ రోజు మీకు రావలసిన ధనం చేతికందుతుంది. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలు ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం ఉంది.
మకరం : ఈ రోజు మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగస్తులకు వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి.
కుంభం : ఈ రాశివారి గృహ నిర్మాణాల్లో వ్యయం అంచనాలను మించుతుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారల శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. సమయానుకూలంగా మీ ఆహారపు అలవాట్లు, పద్దతులు మార్చుకోవలసి రావొచ్చు.
మీనం : ఈ రాశివారు స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పాత స్నేహితులను కలుస్తారు. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి.