telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 8, శనివారం రాశిఫ‌లాలు

మేషరాశి..

ఆకస్మిక ఖర్చుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టబోయే పనుల్లో ఆజాగ్రత్తగా వ్యవహరిండం మంచిది కాదు. కుటుంబంలో అనవసర విషయాల్లో తలదూర్చకండి.. ఓర్పు, సహనంతో వ్యవహరించాలి. బంధుమిత్రుల సాయం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభరాశి..

ఆలయ సందర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చూడ‌తారు. తోటివారి సాయం అందుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకున్న ల‌క్ష్యం సాధిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది. విందువినోదాల్లో పాల్గొంటారు.

మిథునరాశి..

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. కుటుంబంలో శుభ‌వార్త వింటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వాహనాలు కొంటారు. స్థిరాస్తి మ‌రింత వృద్ధి చెందుతుంది.

కర్కాటకరాశి..

ఉద్యోగస్తులు వేరేచోట‌కి ట్రాన్స్ ప‌ర్స్ అవుతాయి. ముఖ్య‌మైన‌ ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో బంధుమిత్రులు, సన్నిహితుల సూచనలు తీసుకోవడం మంచిది. బంధువుల‌లతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆనారోగ్యం భారిన ప‌డ‌తారు. ఉద్యోగాలలో పై అధికారులు నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి.

సింహరాశి..

ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. బంధుమిత్రులు, సన్నిహితులతో కలిసి విందువినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో వేరే వ్య‌క్తితో విభేదాలు ఏర్ప‌డ‌తాయి.ఆరోగ్యం మంద‌గిస్తుంది. మీ కార్యాల‌యాల్లో శ్రమ అధికం అవుతుంది.

కన్యరాశి..

రాజ‌కీయ రంగంలో ఉన్న‌వారు మీదే పైచేయి సాధిస్తారు. కొందరి ప్రవర్తన వల్ల కొన్ని చికాకులు ఎదురవుతాయి. వేరే వారి గొడవలకు దూరంగా ఉండం మంచిది. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు చేయ‌డం మంచిదికాదు . ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వ్య‌హించ‌డం మంచిది కాదు.

తులరాశి..

స్త్రీలకు బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు చేసే వారికి మంచి మార్పులుంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధులతో కొన్ని విష‌యాల్లో దూరంగా ఉండ‌డం మంచిది. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. దైవ‌ద‌ర్శనాలు చేస్తారు.

వృశ్చికరాశి..

రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. బంధుమిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. చిన్నచిన్న విషయాల గురించి ఆందోళన తగదు. ప్రయాణాల్లో జాగ్రత్త వ‌హించ‌డం మంచిది.

ధనుస్సురాశి..

నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయ‌డం మంచిది. అవసరానికి మించి ఖ‌ర్చులు అధిక‌మ‌వుతాయి. అనారోగ్యం బాధ క‌లిగిస్తుంది. కుటుంబంలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి.

మకరరాశి..

మొండి బాకీలు వ‌సూలు అవుతాయి. ఏదైనా కార్యాలు త‌ల‌పెట్ట‌డానికి అనుకూలమైన సమయం ఏర్ప‌డుతుంది. విద్యార్ధులు రాత ప‌రీక్ష‌ల్లో విజయం సాధిస్తారు. విందు వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టమైన వారితో సికారుకు వెళ‌తారు. దూర‌ ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నూత‌న పరిచయాలు ఏర్ప‌డ‌తాయి.

కుంభరాశి..

దైవదర్శనాలు చేస్తారు. కుటుంబసభ్యులతో త‌గాదాలు ఏర్ప‌డ‌తాయి. ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తోటివారి సాయంతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తెలియ‌ని వారితో జాగ్రత్త వ్య‌వ‌హారించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం మంచిది.

మీనరాశి..

స్త్రీలు అనుకున్నది సాధిస్తారు. ముఖ్య వ్య‌వ‌హారాల్లో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విందువినోదాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఏర్ప‌డుతుంది.ఆస్తుల కొనుగోలు చేస్తారు.దైవ‌ద‌ర్శనాలు చేస్తారు.

Related posts