రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోండి. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలాంటి సామాజిక, మత కార్యక్రమాలకు అనుమతి ఇచ్చేది లేదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. కరోనా సంక్షోభమే ఇందుకు కారణమని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈ మేరకు ఆదేశించారని అడిషనల్ చీఫ్ సెక్రటరీ తెలిపారు. శనివారం, ఆదివారం మార్కెట్లను మూసివేయడంతో సహా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించిందని తెలిపారు.
మార్కెట్లను వారానికొకసారి మూసివేసేటప్పుడు అన్ని జిల్లాల్లో ఇంటెన్సివ్ శుభ్రతను, ఫాగింగ్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. కరోనా వైరస్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు ఇటువంటి చర్యలు తప్పవన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వద్ద నుంచి పోలీసులు మార్చి చివరివారం నుంచి ఇప్పటివరకు రూ. 70 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు.
అమరావతి గురించి ఇష్టం వచ్చినట్టు ప్రచారం: సుజనా చౌదరి